మహిళలకు ఎంతో మేలు చేసే సోయాపులావ్..!

శుక్రవారం, 2 నవంబరు 2012 (16:50 IST)
FILE
సోయా పులావ్ మహిళలు వారానికి మూడుసార్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సోయాలో ఉన్న ఆల్ఫా లినోలిక్ ఆమ్లం, ఈస్ట్రోజన్ మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు చెబుతున్నారు. ఇంకా సోయా పులావ్‌ను పిల్లలకు కూడా ఇవ్వొచ్చు. కానీ అలర్జీ, క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న వారు మాత్రం సోయా పులావ్ తీసుకోకూడదు.

ఇక సోయా పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
సోయా పప్పు -ఒక కప్పు
బాస్మతి రైస్ - రెండు కప్పులు
పచ్చిమిర్చి - మూడు
అల్లం తురుము - 1 టీస్పూన్
జీలకర్ర - 1టీ స్పూన్
జీలకర్ర పొడి - రెండు టీ స్పూన్లు
ఏలకులు - రెండు
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
జీడిపప్పు - అర కప్పు
నూనె - తగినంత
కొత్తిమీర తరుగు - కాసింత.

ఎలా చేయాలి:
సోయా పప్పును ఆరు గంటల పాటు నానబెట్టి.. ఉడికించి పక్కనబెట్టుకోవాలి. బాస్మతి రైస్‌ను ఉడికించుకోవాలి. స్టౌ వేడయ్యాక బాణలిలో నూనె పోసి, జీలకర్ర, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఏలకులు, జీడిపప్పు. ఉడికించిన సోయాను చేర్చి బాగా కలపాలి.

ఈ మిశ్రమంలో నీరు బాగా మరిగాక ఉడికించిన అన్నాన్ని వేసి, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి చేర్చి దించేయాలి. ఇలా తయారైన సోయా పులావ్‌‍ను కొత్తిమీర తురుముతో డెకరేట్ చేసి వేడి వేడిగా టమోటా సాస్‌తో సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి