గాన కోకిల లతా మంగేష్కర్ ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ప్రస్తుతం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు.
అయితే, ఈ సాయంత్రం ఆమె చికిత్స ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నట్లు ఒక ప్రకటన వెలువడింది. కానీ, ఆస్పత్రికి చెందిన సీనియర్ డాక్టర్ ఒకరు, "ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు అని తెలిపారు.
"సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లతా మంగేష్కర్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు" అని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. హిందితో పాటు తెలుగు, తమిళ, మలయాళం వంటి విభిన్న భారతీయ భాషలలో వేలాది గీతాలను ఆలపించి పాటల ప్రియుల మదిలో చెరగని ముద్ర వేసిన లతా మంగేష్కర్‌ను భారత ప్రభుత్వం భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో గౌరవించింది.