ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా

మంగళవారం, 8 మార్చి 2022 (15:03 IST)
ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా రికార్డులకెక్కింది. సిరియా, ఇరాన్‌ల కంటే ఎక్కువగా రష్యా ఇప్పుడు ఆంక్షలను ఎదుర్కొంటోందని ఆంక్షలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచే Castellum.ai అనే సంస్థ వెబ్‌సైట్ వెల్లడించింది.

 
ఫిబ్రవరి 22 నాటికి రష్యాపై మొత్తం 2,754 రకాల ఆంక్షలను విధించినట్లు ఈ సంస్థ పేర్కొంది. యుక్రెయిన్ పై ఆక్రమణ మొదలుపెట్టినప్పటి నుంచి మరో 2,778 ఆంక్షలను విధించారు. దీంతో, రష్యా పై ఆంక్షలు 5,532కు చేరాయి. ఇరాన్ పై 3,616 ఆంక్షలు అమలులో ఉండగా, రష్యా దీనిని మించిపోయింది.

 
ఇందులో అత్యధికంగా 21 శాతం ఆంక్షలు అమెరికా విధించినవే ఉన్నాయి. యూకే, యూరోపియన్ యూనియన్ కలిపి విధించిన ఆంక్షల శాతం 18గా ఉంది. యుక్రెయిన్‌పై చేస్తున్న దాడులను ఆపేలా ఒత్తిడి తెచ్చేందుకు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి వివిధ దేశాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు