ఓ యువతితో తాను పడకపై ఉన్నట్లు విడుదల చేసిన దృశ్యాలు ఫేక్ అని కర్ణాటక మంత్రి రమేశ్ జార్కిహొళి చెప్పారు. అదంతా తనపై కుట్ర అని ఆయన అన్నారు. నాలుగు నెలల కిందటే ఆ సీడీల విషయం తన దృష్టికి వచ్చిందని.. దాన్ని వారు మీడియాకు విడుదల చేయడానికి 24 గంటల ముందు కూడా తనకు తెలుసని రమేశ్ చెప్పారంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఇదంతా చేశారని.. ప్రస్తుతం తాను ఇంతకుమించి ఏమీ చెప్పబోనని ఆయన అన్నారు. అయితే, వారిని జైలుకి పంపించేవరకు వదిలిపెట్టబోనని రమేశ్ అన్నారు. రాజకీయ నాయకులపై జరిగే ఇలాంటి కుట్రలు, బ్లాక్ మెయిళ్లను అరికట్టేలా చట్టం ఉండాలని రమేశ్ అభిప్రాయపడ్డారు.
తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో రాకుండా చూడాలంటూ ఆరుగురు మంత్రులు కోర్టుకు వెళ్లడాన్ని తాను మద్దతిస్తున్నానని ఆయన అన్నారు. హెచ్‌డీ కుమారస్వామిని, ఆయన కుటుంబాన్ని తానేమీ నిందించబోనని.. తనకు సంబంధించిందంటూ సీడీ విడుదలైన తరువాత హెచ్‌డీ రేవన్న, కుమారస్వామి ఇద్దరూ తనతో మాట్లాడారాని రమేశ్ చెప్పారు.