2020లో కోవిడ్‌తో మరణించిన డాక్టర్లు వీరే

గురువారం, 31 డిశెంబరు 2020 (13:45 IST)
2020లో కరోనావైరస్ బారిన పడి భారత్‌లో 1,45,000 మందికి పైగా చనిపోయారు. వైరస్‌తో పోరాటంలో కీలక పాత్ర పోషించిన వైద్యులు, నర్ససులు కూడా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత వైద్య సంఘం వెల్లడించిన నివేదిక ప్రకారం, 2020 సెప్టెంబర్ నాటికి దేశంలో 500 మందికి పైగా కోవిడ్‌తో మరణించారు. వారిలో అత్యధిక మంది 41 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు జనరల్ ప్రాక్టీషనర్లు ఉన్నారు.
 
అత్యధికంగా తమిళనాడులో 40 మందికి పైగా డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. కోవిడ్ కారణంగా మరణించిన వైద్యులలో అత్యధికులు జనరల్ ప్రాక్టీషనర్లే. ఎమర్జెన్సీ మెడిసన్, జనరల్ సర్జన్, గైనకాలజిస్టులు ఆ తరువాత స్థానంలో ఉన్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాలు చెబుతున్నాయి.
 
కాగా భారత్‌లో 2020 డిసెంబరు 30 వరకు మొత్తంగా 1,48,439 మంది కరోనా కారణంగా మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 49,373 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో 7,100 మంది ప్రజలు.. తెలంగాణలో 1538 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,62,272 యాక్టివ్ కేసులున్నాయి. 98,34,141 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు