వేసవిలో రాత్రి నిద్రించేందుకు ముందు కలబంద జెల్ గాని, జ్యూస్ కానీ ముఖానికి రాసుకుని గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై మీద ఉన్న మొటిమలు, మచ్చలు, చెమటకాయలు తగ్గుముఖం పడుతాయి. అలాగే బాదం నూనెకు కాస్త నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకుంటే.. కళ్ల కింద రాసుకుంటే మచ్చలు దూరమవుతాయి. ఇలా చేయడం వల్ల ఉదయం లేచే సమయానికి ముఖం కాంతివంతంగా మారుతుంది.