ఉసిరి వైద్యానికి మాత్రమే కాకుండా సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా వాడుతున్నారు. ఉసిరి సహజ ఔషదంగా చెప్పవచ్చు. ఉసిరితో చేసిన చాలా రకాల సౌందర్య ఉత్పత్తులు మనకు లభిస్తున్నాయి. ఉసిరి, జుట్టును వత్తుగా, పొడవుగా మెరిసేలా చేస్తుంది.
ఉసిరికి, కొవ్వు పదార్థాలను తగ్గించే గుణం ఉంది. ఉసిరిని తినటం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఉసిరి ప్రధానపాత్ర పోషిస్తుంది.
ఉసిరిపొడిలో కొంచెం మజ్జిగ, కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం బాదం కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుండి నివారణ లభిస్తుంది. ఉసిరి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగ చేయటమే కాకుండా, వివిధ రకాల వ్యాధి కారకాలతో పోరాడుతుంది.