అరటి పండు తొక్క, అలెవెరాతో సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొటిమలు గల ప్రాంతంలో అరటి పండు తొక్కతో రోజు రుద్దండి. అరటి పండు ముక్కని మొటిమలపైన రుద్ది, ఆ ముక్కను అలానే మొటిమలపైన ఉంచితే పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే బంగాళాదుంపను కత్తిరించి ముఖంపైన మొటిమలు ఉన్న ప్రదేశంలో చాలా సార్లు రాయండి. ఇలా రెండు రోజుల పాటూ చేయండి.
మీ మొటిమలు తప్పకుండా తగ్గిపోతాయి. అలాగే కలబందని తినటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నేరుగా మొటిమల పైన రుద్దటం వలన మొటిమలు కనబడకుండా చేస్తుంది. కలబంద అందుబాటులో లేనట్లయితే కలబందతో తయారు చేసిన క్రీమ్స్‌ని వాడటం వలన ప్రయోజనాలు పొందుతారు. క్యాస్టర్ ఆయిల్ జుట్టు కోసమే కాకుండా, మొటిమల నివారణకు వాడొచ్చు. ఇంకా ముఖంపై రాసుకుంటే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.