తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

ఠాగూర్

బుధవారం, 16 జులై 2025 (17:05 IST)
తాను కూడా ఓ మహిళే అనే విషయాన్ని మరిచిపోయిన ఓ మహిళా హాస్టల్ వార్డెన్... హాస్టల్ విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరాను అమర్చి ఫోటోలు, వీడియోలు తీసింది. దీన్ని పసిగట్టిన విద్యార్థినిలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో అనేక మంది తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని వార్డెన్‌కు దేహశుద్ధి చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో 9 నుంచి ఇంటర్ వరకు 80 మంది విద్యార్థినులు చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నారు. విద్యార్థినులు స్నానాల గదుల్లో ఉన్నప్పుడు తలుపులు వేయవద్దని చెప్పి వార్డెన్ శౌరీబాయి చిత్రాలు, వీడియోలు తీసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించింది. విద్యార్థినులు ఎదురు తిరిగితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తల్లిదండ్రులకు లేనిపోని మాటలు చెప్పి, ఫిర్యాదు చేస్తూ వచ్చింది. 
 
గతంలోనూ ఆమె ప్రవర్తనపై ప్రిన్సిపాల్‌కు, పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు వాపోయారు. వార్డెన్ ఆకృత్యాలు పెరిగి విద్యార్థినులు భయాందోళనలు వ్యక్తం చేస్తుండటంతో ప్రశ్నించేందుకు మంగళవారం పాఠశాలకు వచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. సత్తెనపల్లి డీవైడీఈవో ఏసుబాబు, ఎంఈవో రవికుమార్, తహసీల్దార్ వెంకటేశ్వరనాయక్, సీడీపీవో కృష్ణవేణి పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ నయోమి, వార్డెన్ శౌరీబాయిలను విచారించారు. 
 
విద్యార్థినులతో మాట్లాడి నివేదికలు తయారు చేశారు. దీనిపై ఎంఈవో మాట్లాడుతూ పాఠశాలలో పరిస్థితులపై విచారణ జరిపామని, వార్డెన్‌పై దాడి చేసింది విద్యార్థినుల తల్లిదండ్రులు కాదని, బయటి వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఉపాధ్యాయులు తెలిపారన్నారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు