ప్రతిరోజు సాయంత్రం రోజ్‌వాటర్‌ను కాళ్ల పగుళ్లపై రాసి మృదువుగా మర్దనా చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే నిమ్మరసంలో వ్యాజ్‌లైన్ వేసి గోరువెచ్చని సబ్బు ద్రావణంలో పాదాలను పెట్టాలి. ఆ తరువాత పొడి వస్త్రంతో పాదాలను తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను రాయాలి. ఉదయాన్నే ఆవనూనెతో కాళ్లను మర్దనా చేసుకుంటే పగుళ్లు మెత్తబడి కొద్దిరోజులకే తగ్గిపోయే అవకాశం ఉంది.