ప్రతిరోజూ రాత్రిపూట కీరదోస రసంలో కొన్ని పాలు చేర్చి అందులో దూది ముంచి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురికి పోయి, చర్మం తాజాగా అవుతుంది. కీరదోసం రసం యాంటీ ఏజ్ ఏజెంట్‌గానూ పనిచేస్తుంది. వారానికి రెండు సార్లు ముఖానికి కీరదోస రసాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం కాంతులీనుతుంది.
ఫ్రిజ్‌లో ఉంచిన కీరదోస ముక్కల్ని చర్మంపై దద్దుర్లు, దురద ఉన్నచోట రుద్దితే... ఉపశమనం లభిస్తుంది. ఓట్స్‌ని పొడిగా చేసి అందులో కీరా దోస రసం కలిపి.. ముఖం, మెడకు పూతలా వేయాలి. కాసేపయ్యాక చేతుల్ని తడి చేసుకుని మర్దన చేసుకుంటూ ఆ పూతను తొలగించాలి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
రెండు చెంచాల నిమ్మరసం, కీరదోస రసం.. చెంచా కలబంద, తేనె అన్నింటినీ కలిపి మిశ్రమం చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగితే... జిడ్డు పేరుకోకుండా ఉంటుంది.