కొబ్బరినూనెలో మరువం వేసి కాచి వడగట్టి ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పెదాలు నల్లగా ఉంటే బీట్‌రూట్ ముక్కలు పెదాలకు రుద్దుకుంటే నలుపుదనం తొలగిపోతుంది. మెడ నలుపుగా ఉంటే బొప్పాయిపండు గుజ్జును రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెడ తెల్లగా మారుతుంది.