మల్లి ఆకులను మెత్తగా పేస్టులా చేసి అక్కడ రాసుకుంటే?

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (12:36 IST)
పాదాల పగుళ్లు తొలిగిపోవాలంటే మల్లి ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన పాదాల పగుళ్లు తొలగిపోతాయి. పుట్టుమచ్చలు పోవాలంటే పచ్చి ధనియాలు నూరి ఆ మచ్చల మీద రాసుకోవాలి. ఇలా చేస్తే పుట్టుమచ్చలు పోతాయి.
 
నిమ్మరసంలో కొద్దిగా వెనిగర్‌ను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు నల్లగా మారుతుంది. పెదాలు మృదువుగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు మీగడను రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. పెరుగులో కొద్దిగా శెనగపిండిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. తద్వార మెుటిమలు తగ్గుతాయి. 
 
గంధాన్ని రోజ్ వాటర్‌లో కలుపుకుని ముఖానికి రాసుకుంటే ముఖం మీద గల రాషెస్ పోతాయి. గంధంలో హారతి కర్పూరాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే మెుటిమలు తగ్గిపోతాయి. నిమ్మరసంలో అల్లం రసం, పెరుగును కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా కాంతివంతంగా కూడా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు