కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. మరి దీనితో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. నాలుగు స్పూన్ల పాలు వేడిచేసి అందులో 4 చుక్కల నిమ్మరసం, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చెవులు, మెడలకు రాసుకోవాలి. ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఆ తరువాత మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా తరచు చేస్తుంటే.. ముఖం తాజాగా మారుతుంది.
క్యాబేజీని మిక్సీలో మెత్తని గుజ్జుగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె, శెనగపిండి, పసుపు చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే సరిపోతుంది.