గోధుమ పిండిలో వెన్నను కలిపి మెడకు రాసుకుంటే?

మంగళవారం, 25 జులై 2017 (15:37 IST)
ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. కంటి కిందటి వలయాలు తొలగిపోవాలంటే కీరదోస కాయ, బంగాళాదుంపను సమానంగా తీసుకుని పేస్టులా తీసుకుని కంటి కిందటి నల్లటి వలయాల కింద రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేలిగ్గా వుండే తెలుపు రంగు కాటన్‌ను పన్నీరులో ముంచి దాన్ని కంటిపై వుంచాలి. దానిపై రుబ్బిన పొటాటో, కీరదోస పేస్టును ఉంచాలి. పది నిమిషాల పాటు వుంచి తీసేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. నల్లటి వలయాలు దూరమవుతాయి. 
 
అలాగే పాదాలు మృదువుగా తయారవ్వాలంటే.. రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు వేడినీటిలో కాసింత ఉప్పు, నిమ్మరసం, షాంపు వేసి ఐదు నుంచి 10 నిమిషాల పాటు పాదాలను నానబెట్టాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయాలి. ఆపై పాదాలను పొడిబట్టతో తుడిచి వేడి చేసిన నువ్వుల నూనెను రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. గోధుమ పిండిలో వెన్నను కలిపి మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మెడ భాగంలో వుండే నల్లటి వలయాలు దూరమవుతాయి.

వెబ్దునియా పై చదవండి