గోరింటాకు పొడి, కలబంద గుజ్జుతో.. నల్లటి వలయాలు..?

బుధవారం, 7 నవంబరు 2018 (11:11 IST)
ముఖం అందంగా కనిపించాలని ఏవేవో క్రీములు వాడి ముఖాన్ని పాడుచేస్తుంటారు. ఇలాంటి క్రీములు వాడకుండానే అందంగా మారొచ్చని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం... ఇంట్లో దొరికే పదార్థాలతో ముఖం అందం మరింత పెరుగుతుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..
 
1. కరివేపాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అందానికి ఎలా.. కరివేపాకు పొడిలో కొద్దిగా వంటసోడా, నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. గంట తరువాతు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోతాయి.
 
2. శీకకాయ గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని అందులో కొద్దిగా తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముడతల చర్మం తొలగిపోతుంది. 
 
3. గోరింటాకు పొడిలో కొద్దిగా కలబంద గుజ్జు, కీరదోస రసం, నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. 
 
4. క్యారెట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటితో జ్యూస్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసం, చక్కెర కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
5. ఉల్లిపాయ మిశ్రమంలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, ఉప్పు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముడుతలు చర్మం రాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు