మహిళలు ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాలి..?

సోమవారం, 5 నవంబరు 2018 (12:40 IST)
తలనొప్పి సమస్యతో బాధపడుతున్నవారు.. ఇలా చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. పాలలో కొద్దిగా బెల్లం, నెయ్యి కలిపి ప్రతిరోజూ సేవిస్తే తలనొప్పి తగ్గుతుంది. చాలామంది సాధరణంగా జలుబుగా ఉన్నప్పుడు పెరుగు అంతంగా తీసుకోరు. ఎందుకంటే.. పెరుగు చల్లని పదార్థం కాబట్టి దానిని తీసుకుంటే జలుబు ఇంకా ఎక్కువవుతుందని వారి నమ్మకం. కానీ, జలుబు తగ్గించే గుణం పెరుగులో మాత్రమే ఉంది. కనుక పెరుగులో కొద్దిగా పటిక బెల్లం కలిపి రోజుకు రెండుపూటలా తీసుకుంటే జలుబు నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 
నెల పుట్టిదంటే చాలు.. స్త్రీలు నెలసరి సమస్యలతో బాధపడుతుంటారు. ఆ నొప్పులు తగ్గాలంటే.. ఇలా చేయాలి. కాకర ఆకులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి తీసుకుంటే నెలసరి సమస్యలు తొలగిపోతాయి. అలాకాకుంటే నేతితో కలిపిన బెల్లం వేడిచేసి నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకుంటే నొప్పి తగ్గుతుంది.
 
పొడిదగ్గు సమస్యకు చెక్ పెట్టాలంటే.. నీటిలో కొద్దిగా బెల్లాన్ని పానకంలా చేసుకుని అందులో కొన్ని తులసి ఆకులను వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. అజీర్తి సమస్యకు బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే చప్పరిస్తే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు