పెదాలకు తేనె రాసుకుంటే..?

శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:40 IST)
చాలామంది అందంగా కనిపించడానికి ఏవేవో క్రీమ్స్, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. అయినా ఫలితం కనిపించలేదని సతమతమవుతుంటారు. అలాంటి వారికి అందం రెట్టింపు కావాలంటే ఇంట్లోని సహజమైన పదార్థాలు వాడితే చాలంటున్నారు బ్యూటీ నిపుణులు.
 
1. 2 స్పూన్ల తేనెలో కొద్దిగా నిమ్మరసం పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో ముఖానికి రాసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే నల్లటి మచ్చలు పోతాయి.
 
2. పెదవుల మీద మృతుకణాలు తొలగించాలంటే తేనె రాసుకోవాలంటున్నారు. ఇలా చేస్తే ఉదయానికల్లా పెదాలు గులాబీలంత మృదువుగా తయారవుతాయి.  
 
3. కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేస్తే ముఖచర్మం కాంతివంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా రాత్రి పడుకునే ముందు మచ్చల మీద తేనె రాస్తుంటే కొద్ది రోజులకు మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.
 
4. ఆలివ్ నూనెలో తేనె కలిపి వెంట్రుకల కొసళ్లకు రాస్తుంటే జుట్టు చివర్ల చిట్లకుండా తగ్గుతుంది. మొటిమల మీద తేనే రాసి బ్యాండేజీతో కప్పాలి. ఉదయాన్నే కడిగితే మొటిమలు తగ్గుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు