మొటిమలు సమస్యతో చింతిస్తున్నారా...???

సోమవారం, 12 ఆగస్టు 2019 (14:31 IST)
నేటి తరుణంలో చాలామంది మెుటిమ సమస్యతో ఎక్కువగా భాదపడుతున్నారు. ఈ సమస్యను తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని చింతిస్తుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు బ్యూటీ నిపుణులు. మరి అవేంటో ఓ సారి తెలుసుకుందాం..
 
1. టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పెరుగు, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
2. పాలలో కొద్దిగా తేనె, స్పూన్ పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.
 
3. చందనంలో స్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు పోతాయి.
 
4. బంగాళాదుంపలను పేస్ట్ చేసి ముఖానికి పట్టించి.. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే.. ముఖంపై గల నల్లటి మచ్చలు పోతాయి.
 
5. సాధారణంగా పాల మీగడను అంతగా ఉపయోగించరు. ఈ మీగడను ముఖానికి రాసుకుంటే.. ముఖం మృదువుగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు