కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు వేసి అక్కడ రాసుకుంటే?

మంగళవారం, 6 ఆగస్టు 2019 (20:47 IST)
సాధారణంగా ఎండల్లో బయట తిరగడం వలన, దుమ్ము, ధూళి ప్రభావం వలన మహిళల్లో ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది. అంతేకాకుండా కొంతమందిలో మొటిమల సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ సమస్యల నుండి తప్పించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు వేసి మొటిమల మీద పూతలా వేసి అరగంటయ్యాక కడిగేస్తే మొటిమల సమస్య నియంత్రణలో ఉంటుంది.
 
2. పెసరపిండిలో నాలుగు చుక్కల నిమ్మరసం, కొంచెం పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసి ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషముల తరువాత కడిగేస్తే ముఖ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
3. పావు కప్పు టమోటా గుజ్జులో కొద్దిగా పెరుగు వేసి కలిపి ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషముల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మం మృదుత్వాన్ని సంతరించుకుని ప్రకాశవంతమవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు