అలాగే శారీరక సమస్యలున్నవారు మినహా అందరూ రోజుకు కనీసం పది గ్లాసుల నీరు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్ ముప్పు ఉండదు. అలసట కూడా దూరమవుతుంది. రోజువారీ ఆహారంలో మాంసం, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులు, తృణ ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో అవసరానికి మించి తినటం మానుకోవాలి.
రోజూ ఓ గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే శరీరంలోని మలినాలు వదిలిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. రోజూ కనీసం అరగంట పాటైనా ఒంటికి ఎండ తగిలితే శరీరానికి అవసరమైనంత విటమిన్ డి లభిస్తుంది. దీనివల్ల చర్మం ముడుతలు పడదు. చర్మక్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. వీటితో పాటు వ్యాయామం అరగంట చేస్తే అందంగానే కాకుండా ఆరోగ్యంగా వుంటారని బ్యూటీషియన్లు చెప్తున్నారు.