స్త్రీలు అందంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాలు కొందరికి సెట్ అవుతాయి మరికొందరికి సెట్‌కావు. మరి సెట్‌కాని వారి పరిస్థితి ఏంటి..? అందుకు ఏం చేయాలి..? కోమలమైన చర్మాన్ని పొందాలంటే.. చర్మకాంతిని రెట్టింపు చేయాలంటే.. కొన్ని సౌందర్య చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..
స్పూన్ మొక్కజొన్న పిండిలో అరస్పూన్ పెరుగు, స్పూన్ బియ్యం పిండి, స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు పాటు అలానే ఉండి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే.. ముఖం చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
పావుకప్పు తులసి ఆకుల గుజ్జులో కొద్దిగా తేనె, పచ్చిపాలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి ఆపై గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేయడం వలన చర్మం అందం రెట్టింపవుతుంది.
ఒక బౌల్‌లో టమోటా జ్యూస్, క్యారెట్ జ్యూస్, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత చల్ల చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.