ఎండ వలన నల్లగా మారి కమిలిన చర్మానికి కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. కుదుళ్లను బలంగా మార్చడంలో కొబ్బరి పాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జుట్టు పొడిబారి ఎండు గడ్డిలా కనిపిస్తున్నప్పుడు.. కప్పు కొబ్బరి పాలలో నాలుగు చెంచాల తేనె, ఒకటి లేదా రెండు కోడిగుడ్ల తెల్ల సొన చేర్చి బాగా కలిపి తలంతా పట్టించాలి. అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది.