నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది. క్యారెట్ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
మరిగించుకున్న పాలలో దూదిని ముంచుకుని ముఖాన్ని తుడుచుకుంటే దుమ్ము, ధూళి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై నల్లని మచ్చలు గలవారు ఆముదంలో దూదిని ఉండలా చేసుకుని ఆ ఉండను ముఖం, మెడపై మర్దన చేసుకోవాలి. గంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మంపై గల నల్లటి మచ్చలు, గాయాలు తగ్గుముఖం పడుతాయి.