పాలలో నెయ్యి వేసుకుని తీసుకుంటే?

గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:20 IST)
ఆయుర్వేదం ప్రకారం మలబద్దకం వాత సంబంద వ్యాధి. ఈ వ్యాధి మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లేకపోవడం వలన వస్తుంది. అంతేకాకుండా వ్యాయామం చేయకపోయినా, థైరాయిడ్, డయాబెటిసి వంటి సమస్యులున్న వారికి మలబద్దకం వస్తుంటుంది. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.
 
గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా నెయ్యి కలుపుకుని ప్రతిరోజూ రాత్రివేళ నిద్రకు ముందుగా తీసుకుంటే శరీరంలో వాత పిత్త సంబంధ సమస్యలు తొలగిపోతాయి. తద్వారా మలబద్దకం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలు కఫ సంబంధిత వ్యాధులు గలవారు తీసుకుంటే కఫ వ్యాధులు అధికమవుతాయి. 
 
కనుక వీరు మాత్రం ఎట్టి పరిస్థితులల్లోనూ ఈ పాలను తీసుకోకూడదు. అలానే కొందరిలో పాలు సుఖ విరేచం కలిగేలా చేస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్యలతో బాధపడేవారు పాలలో నెయ్యి వేసుకుని తీసుకుంటే మంచిది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు