చర్మం ఎక్కువగా పొడిబారడం సహజం. దీనికి చాలా మంది క్రీమ్స్ వాడుతుంటారు. అయితే వేరే పద్ధతుల్లోనూ పొడి చర్మానికి మరింత ఆరోగ్యాన్ని అందించవచ్చు. అవే చర్మాన్ని తేమగా ఉంచే మాస్క్‌లు. వీటిలో ఓవర్‌వైట్ మాస్క్, షీట్ మాస్క్ అందాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అవేంటో చూద్దాం..
నిద్రపోతున్నంత సేపూ చర్మంపై పనిచేస్తూ శరీరాన్ని తేమగా ఉంచడానికి సహకరిస్తుంది. పొడిచర్మం ఉన్నవారికి మరింత మేలు చేస్తుంది. ముఖ్యంగా గాలి, చల్లని వాతావరణం కారణంగా ఏర్పడే పొడి చర్మానికి మంచి పరిష్కారం. సరైన పద్ధతిలో ఓవర్‌నైట్ మాస్క్‌ను వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీన్ని వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ మాస్క్‌ను 5-10 నిమిషాలు మృదువుగా అప్లై చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
సౌందర్య పరిశ్రమలో షీట్ మాస్క్‌లు కొత్తగా వచ్చిన ఉత్పత్తులు తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ఉత్పత్తులు కూడా ఇవే. షీట్‌లా ఉండే వీటిని వాడడం చాలా సులభం. అంతేకాదు, తక్కువ సమయంలోనే శరీరానికి కావాల్సిన తేమను అందించగల సుగుణాలు ఈ మాస్క్‌లో ఉన్నాయి. తక్షణ తేమతో పాటు కాంతివంతమైన చర్మాన్ని అందిస్తాయి. అలానే బొప్పాయి, టమాటా, అరటిపండ్లు, తేనె, శెనగపిండిని కలిపి చేసుకునే మాస్క్‌లు తేమనిస్తాయి.