గ్రీన్ టీ, బియ్యం నీటితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

గురువారం, 30 ఆగస్టు 2018 (15:23 IST)
గ్రీన్ ‌టీలో తేనెను, బియ్యం నీటిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. ఓట్స్‌ను ఉడికించుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.

 
ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. పసుపులో కొద్దిగా నిమ్మరసం, పాలు కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. టమోటా రసంలో పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఆలివ్ నూనెలో ఉప్పు కలుపుకుని బాగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం అందంగా మారుతుంది. ముడతలు తొలగిపోతాయి. కొబ్బరి పాలను ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కోమలంగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు