మందారపువ్వులో కాస్త పెరుగును కలిపి జుట్టుకు రాసుకుంటే?

సోమవారం, 30 జులై 2018 (12:26 IST)
చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. ఈ సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. తలస్నానం చేసే ముందు జుట్టు గోరువెచ్చని నూనెను రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేయడం వలన మాడులో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. ఇందుకోసం నువ్వులనూనె, ఆలివ్ నూనెను వాడవచ్చును.
 
గుప్పెడు మందారపువ్వులను మెత్తగా నూరుకొని ఆ మిశ్రమంలో పావుకప్పు పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. వేణ్నీళ్లలో కాసేపు గ్రీన్ టీ బ్యాగును ఉంచాలి. 5 నిమిషాల తరువాత బ్యాగును తీసేయాలి. ఆ నీటిని తలమీద పోసుకుని జుట్టు మెుత్తం తడిసేలా చూసుకోవాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 
రాత్రివేళ పెరుగులో కొద్దిగా మెంతుల్ని నానబెట్టుకుని ఉదయాన్నే మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు