చిగుళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే?

మంగళవారం, 14 ఆగస్టు 2018 (12:49 IST)
దంతాల మధ్య సందులు ఏర్పడడం, వాటి మధ్యలో ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం వంటి సమస్యల వలన దంతాలు, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు చాలా అధికమవుతున్నాయి. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
ఐస్ క్యూబ్స్‌ను ఒక బట్టలో మూటలా కట్టుకుని దానిని దవడపై పెట్టుకుంటే దంతాలు, చిగుళ్ల నొప్పులు దగ్గుతాయి. అలానే గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఉప్పును కలుపుకుని ఆ నీటిని తీసుకుంటే మంచిది. చిగుళ్ల నొప్పికి వెల్లుల్లిని లేదా ఉల్లిపాయను నలిపి చిగుళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన నొప్పులు తొలగిపోతాయి. అంతేకాకుండా దంతాలు దృఢంగా ఉంటాయి. 
 
గోధుమ గడ్డి రసాన్ని దంతాల నొప్పులకు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఈ రసాన్ని చిగుళ్లపై రాసుకుంటే మంచి ఫలితముంటుంది. నిమ్మకాయను పొట్టును నలిపితే కూడా దంతాల నొప్పులు దగ్గుతాయి. ఇంగులో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని చిగుళ్లకు రాసుకుంటే తక్షణమే అలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు