చల్లని నీరు, రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:20 IST)
కీరదోస మిశ్రమంలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి కిందటి గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. గుడ్డుతెల్లసొనలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికా రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు రావు.
 
చల్లని నీటితో కొద్దిగా రోజ్ వాటర్, తేనె కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే అలసటగా ఉన్న కళ్ళు కాస్త తాజాగా మారుతాయి. టీలో కొద్దిగా కీరదోస మిశ్రమాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు