గురకకు కారణం ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధాంగా ఉంటుంది. ఊపిరితిత్తులలోకి గాలి పీల్చుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఇలా ఇరుకుగా ఉంటే నోటి ద్వారం, ముక్కుల్లో పెరిగే కొవ్వు కండలు వంటి సమస్యలు గురక రావడానికి వంశపార్య కారణాలుగా చెప్పవచ్చును.
తరచుగా తుమ్ములు, దగ్గు, జలుబుతో బాధపడేవారికి ముక్కు రంధ్రాలు శ్లేష్మంతో మూసుకుపోయి గాలి పీల్చుకోలేని పరిస్థితిలో గురక బాధిస్తుంటుంది. మద్యపానం సేవించే వారికి కండరాలు బిగువు కోల్పోయి గురక ఎక్కువవుతుంది. చాలా మందిలో స్థూలకాయం కూడా గురకకి ప్రధానమైన కారణంగా మారి ఇబ్బంది పెడుతుంది.