వంకాయ జ్యూస్ ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. వంకాయలో 92 శాతం నీళ్లు ఉంటాయి. దీనిలో ఉండే నీళ్లు చర్మాన్ని డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంచడానికి సహాయ పడుతుంది. అలానే ఇది స్కిన్ టోనర్‌గా, మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. వంకాయ జ్యూస్‌ను కొద్దిగా తీసుకుని కాసేపు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత స్కిన్ టోనర్ కింద ఉపయోగించండి. ఇలా తరచూ చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది.
అలాగే వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో క్యాన్సర్‌ని నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి. వంకాయ తొక్కని ముఖానికి రాయడం ద్వారా వల్ల ముడతలు, డార్క్ స్పాట్స్ వంటివి తగ్గిపోతాయి. వంకాయ జుట్టు ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే వంకాయని జుట్టుకి, మాడుకి పట్టించడం వల్ల సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.