నవగ్రహ దోషాలను తొలగించుకోవాలంటే.. కొన్ని కీలక సూచనలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. నీలం, పచ్చ రంగులను శనివారం పూట ధరించకపోవడం మంచిది. రోజు నుదుట పసుపు రంగుతో కూడిన బొట్టును ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే నవగ్రహ దోషాల నుంచి తప్పించుకోవాలంటే.. శని భగవానుడికి ప్రీతికరమైన దానాలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
గుప్పెడు బియ్యాన్ని నది లేదా చెరువుల్లో వేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా చేయడం చంద్రుని అనుగ్రహానికి కారణమవుతుంది. అలాగే బాగా మరిగించిన పాలను ఏదైనా ఆలయానికి 15 రోజుల పాటు ఇవ్వడం శుభ ఫలితాలను ఇస్తుంది. నవగ్రహ దోషాలను తొలగిస్తుంది. ఇంకా వెండి గ్లాసులో నీటిని సేవించడం ద్వారా శుక్రగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఇక చర్మంతో తయారు చేసిన మనిపర్సులను ఉపయోగించకూడదు. ఇంట్లో సూర్యుడికి యాగాలు చేయడం ద్వారా నవగ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. గురువారం పూట ఆలయాల్లో లడ్డూలను ప్రసాదంగా అందజేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయి.
అలాగే గురువారం వెల్లుల్లి, ఉల్లిపాయలను తీసుకోకపోవడం మంచిది కాదు. గోమూత్రాన్ని ఇంట్లో అప్పుడప్పుడు చల్లడం ద్వారా ఇంట్లోని దోషాలు ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అలాగే నవగ్రహ దోషాలు వుండవని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.