చాలా మంది అమ్మాయిలు ముఖారవిందం లేదా నిగారింపుకోసం రకరకాల మాస్క్‌లు వేస్తుంటారు. అందులోభాగంగా ఇటీవల చార్‌కోల్ ఫేస్ మాస్క్‌లూ వచ్చాయి. అవి మంచివే కానీ, అవి వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలూ తప్పనిసరిగా తీసుకోవాలని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
* చార్‌కోల్ మాస్క్‌తో ముఖంమీద ఉండే మొటిమల మచ్చలూ, బ్లాక్‌హెడ్స్, బ్యాక్టీరియా... వంటివన్నీ తొలగిపోతాయన్నది నిజమే.
* ఎందుకంటే వీటిల్లో వాడే యాక్టివేటెడ్ చార్‌కోల్ మామూలు బొగ్గు కాదు.
* కొబ్బరిచిప్పలు, రంపపు పొట్టు, బొగ్గు... వంటి వాటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర ప్రాసెసింగ్ చేసి ఎక్కువ రంధ్రాలు కలిగి ఉండే సన్నని పొడిలా తయారుచేస్తారు.
* ఇలా చేసిన ఈ బొగ్గుపొడికి ముఖంమీద పేరుకున్న దుమ్మూధూళీ, మృతకణాలూ, మలినాలూ, బ్లాక్‌హెడ్సూ... ఇలా అన్నింటినీ బంధించి, తొలగించే లక్షణం ఉంటుంది.