కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ లేదంటే ఆలివ్ ఆయిల్.. ఇలా ఏదో ఒక నూనెను రాత్రిపూట పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. ఉదయాన్నే వేలితో మసాజ్ చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. గోరువెచ్చని నెయ్యిని రాసుకుంటే లిప్స్ లుక్ అదిరిపోతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు కొబ్బరిపాలను కూడా పెదవులకు రాసుకోవచ్చు. రోజు ఇలా చేస్తే వారం రోజుల్లో పెదవులకు కొత్త కాంతి వస్తుంది.
ఇంకా గులాబీ రేకుల్లాంటి పెదవుల కోసం ఏం చేయాలంటే.. ఒక టేబుల్ స్పూన్ తేనెలోకి కాసింత బ్రౌన్‌షుగర్ కలిపిన మిశ్రమాన్ని.. పెదవుల మీద రాయాలి. మెల్లగా మసాజ్ చేయాలి. మెత్తగా నూరిన టమోటా పేస్టును పెదవులకు రాసుకుని.. పదిహేను నిమిషాల తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. పెదవులు నలుపు రంగులో ఉంటే.. తాజా నిమ్మరసం పట్టించండి. రోజా పువ్వు రేకులను మెత్తగా రుబ్బి.. ఆ పేస్టును పెదవులకు రాసుకుంటే నిగారింపు సంతరించుకుంటుంది.