కళ్ల కింద ముడతలు ఉంటే ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగ్‌లను ఓ 15 నిమషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. కొన్ని కారణాల వలన కొందరికి నేత్రాలు పొడిగా మారుతాయి. పొడికళ్లు మంట, దురదకు లోనై కనుగుడ్డుకు నష్టం కలిగిస్తాయి.
కాలుష్యం, వయసు పైబడడం తదితర కొన్ని రకాల సమస్యల కారణంగా కళ్ళలో నీరు సరిపోయినంత తయారుకాకుండా ప్రభావితం చేస్తాయి. రోజుకు మూడు లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వలన సమస్యను అధిగమించవచ్చు. దోసకాయ ముక్కలను 10 నిమిషాలు పాటు కళ్లపై ఉంచుకుంటే కంటి కిందటి నల్లటి వలయాలు పోతాయి.