ముల్తానిమట్టి-పుదీనా-పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

శనివారం, 17 ఆగస్టు 2019 (21:02 IST)
పుదీనాలో ఆరోగ్యకరమైన గుణాలున్నాయి.  పుదీనాలోని సౌందర్య గుణాలు చర్మాన్ని నునుపుగాను, కాంతివంతంగాను మారుస్తాయి. ముఖంపై బ్లాక్ హెడ్స్, మొటిమలలాంటి సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. 
 
తయారు చేసుకోండిలా... తాజా పుదీనా ఆకులు 25గ్రాములు, ముల్తాని మట్టి ఒక టేబుల్ స్పూన్, తాజా పెరుగు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. పుదీనా ఆకులను గ్రైండ్ చేసి అందులో ముల్తాని మట్టి, పెరుగువేసి అరగంట సేవు నాననివ్వండి. అరగంట తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా చిలికినట్లు కలిపి ముఖానికి పేస్ట్‌లా ప్యాక్ వేయండి. 
 
మీరు వేసుకున్న ప్యాక్‌ను 15నిమిషాలవరకు ఉంచండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో మీ ముఖాన్ని కడిగేయండి. తదుపరి చల్లటినీటితోను కడగాలి. దీంతో మీ ముఖం నునుపుగాను, కాంతివంతంగాను తయారవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు