ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు చేసి అందులో కొంచెం పసుపు కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.
పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సాయపడుతుంది. చర్మం నునుపు దేలడానికి ఇది పాటించదగిన చిట్కా.