నిమ్మరసం, అల్లం మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

శనివారం, 29 సెప్టెంబరు 2018 (11:47 IST)
నిమ్మకాయలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా ఉపయోగపడుతాయి. నిమ్మకాయతో పలు రకరకాలు వంటలు చేస్తుంటారు. అంటే ఎక్కువగా  వీటిని ఆలయాలలో  ప్రసాదాలు తయారిచేసి ఇస్తుంటారు. ఇక ఇంటి విషయానికి వస్తే త్వరగా ఏదో ఒక వంట చేయాలని నిమ్మకాయలతో పులిహోర వంటి వంటలు చేస్తారు. అయితే ఈ నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోవడం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...
 
నిమ్మరసంలో దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. పొడిబారకుండా ఉంటుంది. టమోటా రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 
 
నిమ్మరసంలో కొద్దిగా పసుపు, అల్లం మిశ్రమం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు, మెడపై గల నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు