బాగా పండిన జామ పండులోని గింజలను తొలగించి.. గుజ్జును మాత్రం ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. జామపండు గుజ్జును బౌల్‌లోకి తీసుకుని అందులో రెండు స్పూన్ల పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. జిడ్డు చర్మం వాళ్ళు అర స్పూను ఉప్పును వేసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని పంచదార నీటితో ముఖాన్ని స్క్రబ్ చేయాలి.
ఆపై కడిగేసి.. ఐదు నిమిషాల తర్వాత జామపండు, పాల గుజ్జును ముఖానికి పట్టించి.. పేస్ట్‌ను ముఖంపై వలయాకారంలో రబ్ చేయాలి. పదినిమిషాలపాటు మసాజ్ చేసి తడి కాటన్‌బాల్స్‌తో ముఖాన్ని క్లీన్ చేయాలి. ఫేషియల్ ప్యాక్‌ను తీసుకుని ముఖానికి పొరలు పొరలుగా అప్లై చేసుకుని పావుగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి చేస్తే చర్మం మెరిసిపోతుంది.