పెరుగులో తేనెను కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (13:20 IST)
వెంట్రుకలు రాలడం అనేది ఈ కాలంలో చాలా ఎక్కువగా మారిపోతుంది. ఇందుకు కారణాలు ఒత్తిడి, పోషకాహార లోపం, మానసిక సమస్యలు, హార్మోన్స్ అసమతుల్యత వంటి అనేక కారణాల వలన జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తుంటాయి. జుట్టు దృఢంగా, ఒత్తుగా మారేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
పచ్చికొబ్బరిని మిక్సీలో పట్టి దాన్ని మెత్తని, శుభ్రమైన బట్టలో వేసి పాలు వచ్చేలా పిండుకోవాలి. అలా కొబ్బరి పాలను సేకరించి వాటిని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. తరచుగా ఇలా చేయడం వలన వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
వేపాకులను నీటిలో మరిగించుకుని ఆ నీటిని జుట్టుకు రాసుకోవాలి. కాసేపటి తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఇలా రెండుసార్లు చేయడం వలన వెంట్రుకలు రాలడమనే సమస్యలు తొలగిపోతాయి. పచ్చి ఉసిరికాయలను తీసుకుని బాగా మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి దాన్నుండి రసాన్ని తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 
 
20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన వెంట్రుకలు రాలడం తగ్గిపోతుంది. పెరుగులో తేనెను, నిమ్మరసాన్ని కలుపుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. చుండ్రు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు