జుట్టు రాలిపోతుందా.. పెరుగు రాసుకుంటే..?

గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:01 IST)
సాధారణంగా చాలామందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకు రకరకాల నూనెను, షాంపూలు, వాడుతుంటారు. ఇవి వాడిన ఎలాంటి ప్రభావం చూపించలేదని విసుగు చెందుతారు. ఏం చేయాలో తెలియక చింతనలో పడిపోతుంటారు. అందుకు వీటిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి అవేంటో తెలుసుకుందాం.
 
ప్రతి ఆరు వారాలకు ఒకసారి జుట్టు కొద్దిగా కత్తిరించుకుంటే బాగా పెరుగుతుంది. కొందరికి జుట్టు చివర్లలో చిట్లినట్టుగా ఉంటుంది. వారు చిట్లినంత వరకు జుట్టు కత్తించుకోవాలి. కొన్ని రోజులకు జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. జుట్టు పొడిబారకుండా ఉండాలంటే.. గుంటగలగరాకుని మెత్తగా నూరుకుని అందులో కొద్దిగా పెరుగు కలుపుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
వెంట్రుకలు రాలిపోవడానికి ప్రధానం కారణం మాంసకృతులు లోపమే. ఎందుకంటే రోజువారీ ఆహారంలో చేపలు, గుడ్లు, మాంసాహారం తీసుకోవడం వలన జుట్టు అంతగా రాలదు. అదే శాకాహారమైతే బఠాణి, వాల్‌నట్స్, సెనగలు, పప్పు ధాన్యాలు, సోయా వంటి పదార్థాలు తీసుకోవాలి. అప్పుడే మీ జుట్టుకు ఆరోగ్యంగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు