షాంపూలో నిమ్మరసం కలుపుకుని తలస్నానం చేస్తే?

బుధవారం, 29 ఆగస్టు 2018 (12:20 IST)
తలస్నానం చేసేందుకు షాంపూలు వాడుతుంటారు. ఈ షాంపూలలో ఈ పదార్థాలను కలుపుకుని తలస్నానం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. తల దురదగా ఉంటే షాంపూలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని తలస్నానం చేస్తే దురదలు తగ్గుతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది.

 
షాంపూలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది. జుట్టుకు తేమ అందడంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా షాంపూలో కొద్దిగా తేనెను కలుపుకుని తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఉడిపోకుండా ఉండాలంటే ఆరోమా నూనెను షాంపులో కలుపుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలడం వంటి సమస్యలు తొలగిపోతాయి. 
 
షాంపూలో కలబంద గుజ్జును కలుపుకుని తలస్నానం చేస్తే చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఎక్కువగా రాలే సమస్యలు ఉన్నవారు షాంపూలో కొద్దిగా ఉసిరికాయల రసాన్ని కలుపుకుని తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు