అందంగా కనిపించాలా.. ఒత్తిడి పెంచుకోవద్దు!

బుధవారం, 28 జనవరి 2015 (14:27 IST)
అందంగా కనిపించాలా.. ఒత్తిడి పెంచుకోవద్దు అంటున్నారు.. వైద్య నిపుణులు. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ శరీరంలోని ఇతర అంగాల పనితీరును దెబ్బతీస్తుంది. అంగాలన్నీ సమర్థతతో పనిచేస్తున్నప్పుడు ముఖ సౌందర్యం పెంపొందుతుంది. అదే అందాన్నిస్తుంది. 
 
అంగాల పనితీరు దెబ్బతినగానే రక్త ప్రవాహంలో తేడా వస్తుంది. కండరాలు సరిగా పనిచేయవు. మనిషి ముఖంలో వెలుగు లోపిస్తుంది. ఆరోగ్యం కోలం తీసుకునే జాగ్రత్తలు మనస్సును దెబ్బతీయకూడదు.
 
ఇంట్లో వారిని తిడుతూ, విసుక్కుంటూ పనిచేసేవారికి బీపీ పెరిగి ఆరోగ్యం దెబ్బతని చివరికి ముఖాలు వికారంగా కనిపిస్తాయి. మనసు అదుపులో వుంచుకోగలిగిన వారికే ఆనందం, అందం రెండు సమకూరుతాయి. 

వెబ్దునియా పై చదవండి