తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

సెల్వి

బుధవారం, 15 మే 2024 (17:06 IST)
తిరుమల శ్రీవారి ఆలయానికి నడకదారిన వెళ్లే భక్తులు కాస్త అప్రమత్తంగా వుండాలి. తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 
 
తాజాగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై భక్తుల డిమాండ్ మేరకు చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు. 
 
గతేడాది అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం కలకలం రేపింది. ముందుగా ఓ బాలుడిపై దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత కొంతకాలానికి మరో చిన్నారి లక్షితను చిరుత దాడి చేసి చంపేసింది.
 
దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల్ని బంధించారు. ఏకంగా ఆరు చిరుతల్ని పట్టుకుని తిరుపతిలో జూకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు