ఈ 3 చిట్కాలతో ముడతల చర్మానికి చెక్..?

సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (10:40 IST)
చాలామందికి వయస్సు మీద పడే కొద్దీ చర్మం ముడతలు పడడం సహజమే. కానీ, కొందరైతే యుక్త వయస్సులోనే చర్మం ముడతలు పడుతుంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయంటున్నారు బ్యూటీ నిపుణులు. ఈ సమస్య నుండి విముక్తి లభించాలంటే.. ఈ కింద తెలిపిన చిట్కాలు పాటిస్తే ఎవరైనా సరే.. చర్మంపై పడే ముడతలను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఓసారి తెలుసుకుందాం..
 
1. చల్లని నీటితో ముఖాన్ని కడుకున్న వెంటనే టవల్‌తో తుడుచుకోకుండా.. అలానే ఆరనిస్తే చర్మం కొంత మేర తేమను పీల్చుకుంటుంది. దీంతో చర్మానికి తాజాదనం లభిస్తుంది.
 
2. కళ్ళపై, నుదిటిపై దోసకాయ ముక్కలను ప్రతిరోజూ పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు చేస్తే ముడతల చర్మం పోతుంది. దోసకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. కనుక తప్పక దోసకాయను ఉపయోగించండి.
 
3. ఆలివ్ ఆయిల్‌ని ముఖం మీద నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా క్రమంగా చేయడం వలన ముడతల చర్మం పోతుంది. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుని తడుచుకున్న తరువాత నిమ్మరసాన్ని ముఖానికి రాసి అరగంట ఆగి ఆపై ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. ఇలా రెండువారల పాటు క్రమంగా చేస్తే ముడతల చర్మం రాదు.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు