Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

సెల్వి

శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (16:57 IST)
Coconut Milk
కొబ్బరి పాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరిపాలు విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి. జుట్టు చివర్లలో విరిగిపోతుంటే, పొడిగా ఉంటే లేదా పెరగకపోతే, కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు. జుట్టు పెరగాలంటే కొబ్బరి పాలను తీసుకోవాలి. కొబ్బరిని తురుముకుని దానిని మిక్సీలో వేసి పాలు మాత్రం వడకట్టుకోవాలి. 
 
అరకప్పు కొబ్బరి పాలను 1 టేబుల్ స్పూన్ తేనె, ఆలివ్ నూనెతో కలిపి హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి. ఈ హెయిర్ మాస్క్‌ను మీ జుట్టు, తలపై మొత్తం అప్లై చేసి 30-45 నిమిషాలు అలాగే ఉంచండి. ఆపై గోరువెచ్చని నీరు మరియు షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది. 
 
ఇంకా అరకప్పు కొబ్బరి పాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతుల పొడి కలిపి మీ జుట్టుకు పోషకాలను అందించే హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి. ఈ మాస్క్ ను జుట్టుకు అప్లై చేసి, వేర్లకు మాడుకు పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టును పెంచుతుంది. మృదువుగా, ప్రకాశవంతంగా పెరుగుతుంది.
 
అరకప్పు కొబ్బరి పాలలో 2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్‌తో కలిపి తలకు ప్యాక్‌లా వేసుకుని 20-30 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకుని షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే చుండ్రు, తల దురద తగ్గిపోతాయి.
 
అర కప్పు కొబ్బరి పాలను నిమ్మరసంతో కలిపి జుట్టు అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుతుంది. హెయిర్ ఫాల్ వుండదు. జుట్టు మృదువుగా వుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు