బియ్యపు నీళ్లు.. ముల్తానీ మట్టి.. బొప్పాయితో..!

గురువారం, 20 నవంబరు 2014 (17:37 IST)
ఒక కప్పు ముల్తానీ మట్టిని తీసుకుని... అందులో ఒక గుడ్డు తెల్లసొన, రెండు చెంచాల బియ్యపు పిండి, కాసిన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, మాడుకు బాగా పట్టించి.. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో తలంటు స్నానం చేయాలి. కొన్నాళ్ళపాటు వారానికోసారి ఇలా చేస్తే జుట్టు సిల్కీగా తయారవుతుంది. 
 
ఇక అందానికి ఎంతో మేలు చేసే బొప్పాయి నుంచి వచ్చే పాలలో నెయ్యిని కలిపి కొద్దిగా తీసుకుంటే.. అజీర్తి వల్ల కలిగిన కడుపునొప్పి తగ్గుతుంది. అలాగే బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి చేసి, నేతితో కలిపి రోజూ కాస్త తీసుకుంటే.. కడుపులో పురుగులు నశిస్తాయి.

వెబ్దునియా పై చదవండి