ఎప్పుడూ అందంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు ఫాలోకండి!!

గురువారం, 18 సెప్టెంబరు 2014 (15:32 IST)
ప్రతి ఒక్కరికి తాము అందంగా కనబడాలనే కోరిక కలిగి ఉంటారు. అయితే యవ్వనంగా, అందంగా ఉండాలంటే, సరైన ఆహారం తీసుకోవాలి. సరైన టైమ్‌కు నిద్రపోవాలి. రెగ్యులర్ వ్యాయామం ఉండాలి. అప్పుడే యవ్వనంగా కనబడుతారు. 
 
అందంగా కనబడాలంటే , శరీర ఆరోగ్యంతో పాటు, చర్మ ఆరోగ్యానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ప్రొసెస్ చేసిన ఆహారాలు, స్ట్రెస్, టాక్సిన్స్, మరియు తక్కువ న్యూట్రీషియన్స్ కలిగిన ఆహారాల వల్ల వయస్సు మీద మాత్రమే కాదు, చర్మం మీద, ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. 
 
అందుచేత ఎప్పుడూ అందంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు.. బ్యూటీషన్లు. 
 
* కొద్దిపాటి డీహైడ్రేషన్ ఉన్నా నీరు తీసుకోవాలి.
* ద్రాక్షలు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. 
* ఆకుపచ్చని కూరగాయలు, ఎరుపు రంగు పండ్లు తీసుకోవాలి 
* చెర్రీ, బ్రోకోలి వంటి ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏజింగ్ టాక్సిన్స్‌ను నివారిస్తుంది.
* ఎండలో తిరగడం తగ్గించాలి 
 
* నేచురల్ స్కిన్ ప్రోడక్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. 
* పండ్లతో తయారయ్యే నాన్ టాక్సిక్ క్లీనింగ్ ప్రోడక్ట్స్‌ను ఉపయోగించాలి
* ఇండోర్ మొక్కలకు కాలుష్యం యొక్క స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇంట్లో కానీ, మీరు పనిచేసే చోట కానీ, ఎయిర్ ఫిల్టర్ చాలా అవసరం.
 
* రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి తగినంత తీసుకోవడం వల్ల ముడతలు మాయం అవుతాయి. 
* పంచదారను పక్కనబెట్టేయాలి. 
* ఫ్యాట్‌ను తగ్గించే ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవాలి. 
* నీటితో పాటు ఫ్రెష్ జ్యూస్‌లు తీసుకోవాలి. 
* ఒత్తిడిని తొలగించే పనులతో ఎప్పుడూ బిజీగా ఉండాలి. అప్పుడే ఎప్పుడూ అందంగా ఉంటారు. 

వెబ్దునియా పై చదవండి