ముఖం మెరిసిపోవాలంటే పుదీనాతో ఇలా పట్టు వేయాలి

శుక్రవారం, 3 జనవరి 2020 (21:44 IST)
మహిళలు తమ అందానికి మెరుగులు దిద్దేందుకు చేసే ప్రయత్నాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను కొంటుంటారు. ఐతే అందుబాటులో వుండే వాటితోనే అందంగా మారవచ్చు. 
 
1. పుదీనా రసంలో ఓట్స్ కొంచెం తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేయాలి. ఈ మాస్క్‌ను ముఖం మొత్తం అప్లై చేయాలి. కొద్ది సేపు మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు పుదీనా జ్యూస్‌ని రోజు ఒక గ్లాస్ తాగితే శరీరానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది. 
 
2. గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్‌ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది. 
 
3. పుదీనా రసంలో కొద్దిగా పెరుగు మరియు తేనె మిక్స్ చేసి ఈ పేస్ట్‌ని  చర్మానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముడుతలు తొలగిపోయి నిగారింపు వస్తుంది. 
 
4. పుదీనా రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్‌సెల్స్‌ను నివారిస్తుంది. అంతేకాక చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు